ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokesh: టీడీపీ బీసీ రిజర్వేషన్లు పెంచితే.. వైఎస్సార్సీపీ కుదించింది: నారా లోకేశ్

Nara lokesh : తెలుగు దేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లుగా అభివర్థించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. వైఎస్సార్సీపీ, సీఎం జగన్ బీసీ ద్రోహులు అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రిజర్వేషన్లు పెంచితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుదించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దళితులపై జగన్ దమనకాండ కనిపించడం లేదా అని మంత్రి ఆదిమూలపు సురేష్​ను ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 23, 2023, 3:50 PM IST

Nara Lokesh : మంత్రి ఆదిమూలపు సురేష్ షర్టు విప్పి.. బాబు కాన్వాయ్​పై రాళ్లు వేశారు... అయ్యా ఆదిమూలం గారూ మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. దళితులపై దమనకాండకు పాల్పడుతున్న జగన్​ని ఎందుకు ప్రశ్నించడం లేదు? డాక్టర్ సుధాకర్ మొదలుకుని డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మంది దళితులను వైఎస్సార్సీపీ నాయకులు చంపేస్తే సురేష్ గారు ఎందుకు నోరు విప్పలేదు.. అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

బీసీ సామాజిక వర్గాలతో ముఖాముఖి.. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ విడిది కేంద్రం వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. జగన్ ప్రభుత్వం బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని... వైఎస్సార్సీపీ పాలనలో గొర్రెల కాపరులకు ఎటువంటి సాయం అందడం లేదని, దూదేకుల ముస్లిం కుటుంబాలకు, రజకులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదని ప్రతినిధులు వాపోయారు.

బీసీలకు పుట్టినిల్లు... బీసీలకు టీడీపీ పుట్టినిల్లు అని... లోకేశ్ గుర్తు చేశారు. బీసీలని జగన్ నమ్మించి వెన్నుపోటు పొడిచారని... బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశాడని మండిపడ్డారు. బీసీలపై 26 వేల అక్రమ కేసులు పెట్టి వేధించారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని, న్యాయ పోరాటానికి కావాల్సిన ఆర్థిక సాయం ప్రభుత్వమే అందిస్తుందని హామీ ఇచ్చారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. వాల్మీకిలు ఏ వృత్తి లో ఉన్నా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్సిడీ రుణాలు అందజేస్తామని లోకేశ్ వివరించారు.

కొండలు, గుట్టలన్నీ మాయం.. కొండలు, గుట్టల్ని కనపడనీయవా క్యాష్ ప్రసాదూ? అంటూ నారా లోకేశ్​ సెల్ఫీ విడుదల చేశారు. గత మూడురోజులుగా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ అవినీతి చిట్టా బయటపెడుతుంటే.. ఆయనేమో బూతుల పంచాంగం విన్పిస్తున్నాడు... క్యాష్ ప్రసాద్ నేతృత్వంలో ఎర్రగట్టుకొండను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యమిది. రోజూ 50 టిప్పర్ల ఎర్రమట్టిని టిప్పర్ రూ.5వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కొండలు, గుట్టలు కన్పించకుండా చేస్తానని జగన్ రెడ్డి వద్ద ఏమైనా శపథం చేశావా ఎమ్మెల్యే గారూ?! అంటూ ధ్వజమెత్తారు.

బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుంది. ఎన్టీఆర్ బీసీలకు 24శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. చంద్రబాబు నాయుడు అదనంగా 10శాతం పెంచి 34శాతం చేశాడు. కానీ, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 10శాతం తగ్గించింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్ తో పాటు వృత్తిదారులను ఆదుకునేందుకు ఆదరణ పథకాన్ని కూడా పునఃప్రారంభిస్తాం. - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details