గ్రామ సచివాలయానికి తెదేపా పేరు
కర్నూలు జిల్లా ఆదోనిలో జాయింట్ కలెక్టర్ ఖాజా మొయినుద్దీన్ పర్యటించారు. పట్టణములో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం సచివాలయాల కార్యాలయాలను పరిశీలించారు. ఎంపిక చేసిన సచివాలయ కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ పేరు ఉండడంతో పురపాలక సిబ్బందిపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.