ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బెదిరించినా వెనక్కు తగ్గను.. తెదేపా నుంచే పోటీ చేస్తా' - ఆదోనిలో వైకాపా నేతలు పై తెదేపా ఎంపీటీసీ ఫిర్యాదు

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు ఎంపీటీసీ అభ్యర్థి ఈరమ్మ.. తనను వైకాపా నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను తెదేపా నుంచే పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.

Tdp MPTC complaint against ycp  leaders
వైకాపా నేతలు పై తెదేపా ఎంపీటీసీ ఫిర్యాదు

By

Published : Mar 14, 2020, 5:03 PM IST

వైకాపా నేతల బెదిరింపుల వివరాలు తెలియజేస్తున్న ఈరమ్మ

తమను ప్రలోభాలకు గురి చేసేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామ తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి ఈరమ్మ ఆరోపించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆమె ఆశ్రయం పొందుతున్నారు. తన తల్లిని వైకాపా నేతలు అపహరించారంటూ ఈరమ్మ.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అర్థరాత్రి 11.30 గంటలకు పిలిపించిన పోలీసులు.. ఆమెనే ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న మీడియాను చూసి.. పోలీసులు ఈరమ్మను పంపించేశారు. ఎవరు ఎంతగా భయపెట్టాలని చూసినా.. తాను మాత్రం తెదేపా నుంచే పోటీ చేస్తానని ఈరమ్మ స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details