ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేం ఉన్నప్పుడు నిధులు కేటాయించాం... రెండున్నరేళ్లయినా విడుదల చేయరా?' - కర్నూలు జిల్లా నంద్యాల

రెండున్నర సంవత్సరాల క్రితం మసీదు​ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తే... ఇంతవరకు వాటిని విడుదల చేయలేదని తెదేపా ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ కర్నూలు జిల్లా నంద్యాలలో అన్నారు. తెదేపా హయాంలో ఈ నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. బక్రీద్ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని మసీదు​​లో ఫరూక్ పార్థనలు చేశారు.

tdp_mlc_farook_
తెదేపా ఎమ్మెల్సీ ఎన్ఎండి. ఫరూక్

By

Published : Jul 21, 2021, 1:38 PM IST

బక్రీద్ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని మసీదు​లో తెదేపా ఎమ్మెల్సీ ఎన్ఎండీ. ఫరూక్ ప్రత్యేక పార్థనలు చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం మసీదు​ల మరమ్మతులకు తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైకాపా వచ్చాక.. ఇప్పటికీ విడుదల చేయలేదని విమర్శించారు.

రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి స్వంత గ్రామం బేతంచెర్లలోని మసీదు మరమ్మతులకు సైతం నిధులు మంజూరు అయినా... ఇప్పటికీ డబ్బులు అందని పరిస్థితి ఉండడం ఏంటని ఫరూక్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details