ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యం' - tdp campaign at kurnool

కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులతో నగరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

municipal elections at Kurnool
కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యం

By

Published : Feb 27, 2021, 6:42 PM IST

వైకాపా చేస్తున్న దౌర్జన్యాలకు భయపడకుండా మున్సిపల్ ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు సాగాలని... తెదేపా కార్యకర్తలకు కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్​లో నియోజకవర్గ తెదేపా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న 52 మంది అభ్యర్థులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు.

పంచాయితీ ఎన్నికల్లో తెదేపా, వైకాపాకు మధ్య ఎన్నికలు జరగలేదని.. పోలీసులు, తెలుగుదేశం పార్టీకి మధ్య జరిగాయని సూర్యప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న ఎన్నికలూ అదేవిధంగా జరగనున్నాయన్నారు. అండగా ఉంటామని ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. రెండేళ్లల్లో జరిగిన అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని... కార్యకర్తలకు కర్నూలు నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జీ టీజీ భరత్ సూచించారు.

ముమ్మర ప్రచారం..

కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నగరంలో మొత్తం 52 వార్డులుండగా.. అభ్యర్థులు తమతమ వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 27వ వార్డులో తెదేపా అభ్యర్థి వాణీ జగదీశ్వరీ, 33వ వార్డులో గురుస్వామి ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి:

రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details