భాషా ప్రయుక్తంగా ఏర్పడిన మన రాష్ట్రంలో మాతృ భాష వివక్షకు గురి కావడం తెలుగు జాతి ఆలోచించాల్సిన విషయమని తెదేపా నేత మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు భాష, సంస్కృతిపై కర్నూలు కేవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగాలని అభిప్రాయపడ్డారు. రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారని...ఇది ఎంతవరకు సబబని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగించాలి' - మండలి బుద్ద ప్రసాద్ తాజా న్యూస్
తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెదేపా నేత మండలి బుద్ద ప్రసాద్ సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించాలనే ప్రభుత్వం నిర్ణయంతోనే పాలకులకు మాతృభాషపై ఉన్న మమకారం ఏ పాటిదో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
'ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగించాలి'