ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SRISAILAM DAM VISIT: శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన తెదేపా నేతలు - tdp leader kalva srinivasulu latest updates

శ్రీశైలం జలాశయాన్ని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంత తెదేపా నేతలు సందర్శించారు. రాయలసీమ ప్రాంత నీటి హక్కులు కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్​ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మాట్లాడుతున్న తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు
మాట్లాడుతున్న తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు

By

Published : Aug 7, 2021, 4:38 PM IST

శ్రీశైలం జలాశయాన్ని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంత తెదేపా నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ..రాయలసీమ ప్రాంత నీటి హక్కులు కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్​ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ హక్కుల సాధన కోసం శ్రీశైలం నుంచి ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

ఈ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ను ప్రశ్నించే దమ్ము జగన్​కు లేకపోతే రాయలసీమ నీటి హక్కులను ఏ విధంగా కాపాడుతారని నిలదీశారు. వైఎస్ జగన్ రెండేళ్ల పాలనలో రాయలసీమకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీలు స్వంత ప్రయోజనాల కోసం ప్రత్యేక విమానాల్లో దిల్లీకి వెళుతున్నారు తప్పా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం విప్పడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

CBI COURT NOTICES: బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details