ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం పోరాట సమితి రిలే దీక్ష.. తెదేపా మద్ధతు - నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి రిలే నిరాహారదీక్షలకు తెదేపా అండ

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నాయకులు.. రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వారి శిబిరాన్ని సందర్శించిన తెదేపా ప్రముఖులు.. అండగా ఉంటామని స్పష్టం చేశారు.

tdp support for relay hunger strike
మద్ధతు తెలుపుతున్న తెదేపా నేతలు

By

Published : Nov 18, 2020, 6:38 PM IST

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కర్నూలు జిల్లా నంద్యాలలో 'అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి' రిలే నిరాహారదీక్ష చేపట్టింది. మున్సిపల్ కార్యాలయ సమీపంలో.. ఆ సమితి నాయకులు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సలామ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

దీక్షా శిబిరాన్ని.. మాజీ మంత్రి ఫరూక్, కర్నూలు తెదేపా ఇంఛార్జి ప్రభాకర్ చౌదరి, నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జి గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి తదితర నాయకులు పరిశీలించారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details