రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాఫీయాలకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. 108 వాహనాల్లో అవినీతిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులు తెదేపా కార్యాలయం ఆవరణంలో నిరసనకు దిగారు. జగన్ సర్కారు మైన్, వైన్, శాండ్, ఇళ్ల పట్టాలు, కరోనా కిట్లతో పాటు బ్లీచింగ్ పౌడర్‌లోను అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మొన్న సరస్వతి పవర్ కోసం ఏ1 దోచుకుంటే, అరబిందోను అడ్డుపెట్టుకుని ఏ2 దోచుకుంటున్నారని ప్రజల ప్రాణాలను కాపాడే అంబులెన్సుల కొనుగోళ్లలోను 307 కోట్ల రూపాయలకు కుంభకోణం జరిగిందని దీనిపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
'మాఫీయాలకు అడ్డాగా జగన్ ప్రభుత్వం' - tdp leaders protest latest news update
108 వాహనాల్లో అవినీతిని వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాఫీయాలకు అడ్డాగా మారిందని విమర్శించారు.
తెదేపా నేతల నిరసన