రాజధాని అమరావతికి మద్దతుగా కర్నూలులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని లేని పక్షంలో కర్నూలును రాజధాని చెయ్యాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అమరావతికి అందరి మద్దతు ఉందని.. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానిని మర్చుకుంటూ పోతే రాష్ట్రం అభివృద్ధి చెందేది ఎప్పుడని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు రాజధానులు ఏంటని ప్రశ్నించారు. ప్రజలు కరోనాతో భయబ్రాంతులకు గురవుతున్న సమయంలో రాజధాని గొడవలు సరికాదన్నారు.
అమరావతికి మద్దతుగా కర్నూలులో తెదేపా నేతల నిరసన - latest news on three capitals
మూడు రాజధానులకు వ్యతిరేకంగా కర్నూలులో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు రాజధానులు ఏంటని ప్రశ్నించారు.
అమరావతికి మద్దతుగా కర్నూలులో తెదేపా నేతల నిరసన