ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఇద్దరు తెదేపా నాయకుల దారుణ హత్య..! - kurnool district news

tdp leaders murder in kurnool district
tdp leaders murder in kurnool district

By

Published : Jun 17, 2021, 8:14 AM IST

Updated : Jun 17, 2021, 10:50 AM IST

08:12 June 17

వైకాపా నేతల పనేనంటున్న మృతుల కుటుంబసభ్యులు

కర్నూలు జిల్లాలో ఇద్దరు తెదేపా నాయకుల దారుణ హత్య...

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ పడగ విప్పింది. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర రెడ్డి(54), సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాప్‌రెడ్డిని(52)... దారుణంగా నరికి చంపారు. ప్రతాప్‌రెడ్డి సమీప బంధువు ఇటీవల చనిపోగా, మూడో రోజు కార్యక్రమం కోసం శ్మశానవాటికకు వెళుతుండగా... ప్రత్యర్థులు బొలెరో వాహనంతో గుద్దారు. ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వడ్డు వెంకటేశ్వర్‌రెడ్డి(52), వడ్డు సుబ్బారెడ్డి(70), వెంకటేశ్వర రెడ్డి(35) అనే ముగ్గురిని.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు ఈ దాడి ఘటన నుంచి తప్పించుకున్నారు. వైకాపా నాయకులే ఈ హత్యలు చేశారని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దారుణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

విషాదం: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

Last Updated : Jun 17, 2021, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details