స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్నూలు జిల్లా తెదేపా ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం సహా ఇతర ప్రభుత్వ పథకాల్లో అవినీతిని ఎండగట్టాలన్నారు.
ప్రభుత్వ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ప్రభాకర్ చౌదరి - ఎన్నికల తాజా వార్తలు
ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపాలని తెదేపా కార్యకర్తలకు, అభ్యర్థులకు ఆ పార్టీ కర్నూలు ఇన్ఛార్జ్ సూచించారు. ప్రజలే అధికార పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.
ప్రభుత్వ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ప్రభాకర్ చౌదరి
మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు విషయంలో హుందాగా వ్యవహరించలేదని ఆరోపించారు. జగన్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని పార్టీ నాయకుడు సోమిశెట్టి అన్నారు.
ఇదీ చదవండి:బస్సు, లారీ ఢీ.. ఐదుగురికి గాయాలు