కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం మరచి తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలని చూస్తుందని తెదేపా నేతలు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి అరెస్టును తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇంటి ముందు గొడవ పడుతుంటే సర్థిచెప్పేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేపై కేసు నమెదు చేసి అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. ఇందుకు నిదర్శనం శ్మశానవాటికల వద్ద మృతదేహాలకు టోకన్లు ఇవ్వడమే అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తన వక్ర బుద్థి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.