ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"రోడ్లు వేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం" - kurnool latest updates

కర్నూలులో దెబ్బతిన్న రహదారులను తెదేపా నాయకులు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

మాట్లాడుతున్న తెదేపా నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు
మాట్లాడుతున్న తెదేపా నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు

By

Published : Oct 23, 2020, 2:45 PM IST

కర్నూలులో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లను తెదేపా కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలెక్టరేట్ సమీపంలోనే రహదారులు దారుణంగా మారాయని అయినప్పటికి ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details