కర్నూలు జిల్లా మంత్రాలయం మఠానికి చెందిన భూమును విక్రయించాలనే నిర్ణయం బాధాకరమని స్థానిక తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాఘవేంద్ర స్వామిపై భక్తితో దాతలు స్థలాలు విరాళం ఇచ్చారని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మఠం భూములు అమ్మటమంటే హిందూ మనోభావాలను దెబ్బతీయటమేనని తిక్కారెడ్డి అన్నారు. దేవాలయాల భూములు విక్రయించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.