రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతులు అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం నష్ట పరిహారం ప్రకటించకపోవడం దారుణమని.. తెదేపా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలకు రైతులను పరామర్శించడానికి కూడా సమయం లేదని ధ్వజమెత్తారు.
ఈ మధ్యనే కర్నూలు జిల్లాకు వచ్చిన ఒక మంత్రి ప్రజా సమస్యలను వదిలేసి తమ నాయకుడు చంద్రబాబును తిట్టేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. తుంగభద్ర పుష్కరాలకు ఎంతో సమయం లేదని.. ప్రభుత్వం ప్రారంభించిన పనులను పార్టీ తరపున పరిశీలిస్తామన్నారు.