కర్నూలు శివారులో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం గృహాలను నిర్మించిందన్నారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపుల కోసమే జాప్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఇళ్ల పంపిణీ చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
'లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలి' - లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ
పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు ఎన్టీఆర్ గృహాలను నిర్మించామని తెలిపారు తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలు పరిధిలోని ఎన్టీఆర్ గృహాలను కార్యకర్తలతో కలిసి ఆయన సందర్శించారు. లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
'లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలి'