శ్రీశైలం వరద జలాలు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామంటే.. తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేయడం సరికాదని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాయలసీమ అత్యంత వెనకబడిన ప్రాంతమని, దేశంలోనే అత్యల్ప వర్షపాతం అనంతపురంలో నమోదవుతుందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం సామర్ధ్యం తగ్గిందన్న సోమిరెడ్డి.. సముద్రంలో కలిసే వరద జలాలు వాడుకునేందుకు పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచుకుంటే అభ్యంతరం ఏమిటన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా మెలగాలని సూచించారు. ఏడాదిన్నరగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వదిలేయడం సీఎం జగన్కు తగదన్నారు. తెదేపా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.