నీటి అవసరాలు లేకుండానే శ్రీశైలం జలాశయ నీటిని తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకోవడం అన్యాయమని మాజీ మంత్రి, తెదేపా నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... తెలంగాణ తీరుపై రాయలసీమ ప్రజాప్రతినిధులు ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోకపోతే...రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
శ్రీశైలంపై తెలంగాణ ప్రయత్నాలను ఆపాలి: ఏరాసు ప్రతాప్ రెడ్డి - krishna board news
శ్రీశైలం జలాశయం నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహారిస్తోందని తెదేపా నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.
srisailam water