ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టిడ్కో ఇళ్లు పంపిణీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు...'

వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్లు కేటాయించకపోవటంపై తెదేపా నేత కోట్ల సుజాతమ్మ కర్నూలులో మాట్లాడారు. ఇళ్లను కేటాయించకుండా ముఖ్యమంత్రి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తుంగభద్ర పుష్కరాలకు కోట్ల రూపాయల ఖర్చు ఎందుకంటూ ప్రశ్నించారు.

tdp leader kotla sujathamma
తెదేపా నేత కోట్ల సుజాతమ్మ

By

Published : Nov 10, 2020, 7:54 AM IST

పేదలకు టిడ్కో ఇళ్లు కేటాయించకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని తెదేపా నేత కోట్ల సుజాతమ్మ కర్నూలులో అన్నారు. జగన్​ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు మరిచారని మండిపడ్డారు. కరోనా సమయంలో సరైన ఆదాయం లేక ఇంటి అద్దెలు కట్టేందుకు పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.

జనవరి నెల లోపు ఇళ్లు కేటాయించకపోతే తెదేపా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించిందని సుజాతమ్మ అన్నారు. కరోనా కారణంగా స్నానాలు చేసేందుకు అనుమతివ్వని ప్రభుత్వం కోట్లు ఖర్చు చేయటం ఎందుకని ప్రశ్నించారు. ఆ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించవచ్చంటూ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details