పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులను గెలవనీయకుండా వైకాపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెదేపా నేత కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పోలీసులతో ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తప్పించుకునేందుకు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆక్షేపించారు.
'ఓటమి తప్పించుకునేందుకు... ఓటర్లకు ప్రలోభాలు' - కోట్ల జయప్రకాశ్ న్యూస్
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పించుకునేందుకు వైకాపా ప్రభుత్వం ఓటర్లను ప్రలోభపెడుతోందని తెదేపా నేత కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పోలీసులతో ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
!['ఓటమి తప్పించుకునేందుకు... ఓటర్లకు ప్రలోభాలు' ఓటమి తప్పించుకునేందుకు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10678858-544-10678858-1613648844136.jpg)
ఓటమి తప్పించుకునేందుకు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు