కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రానికి సమీపంలో నిర్మిస్తున్న జయరాజ్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ వద్ద మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పనుల కోసం ఇష్టారాజ్యంగా పేలుళ్లు చేస్తున్నారని... ఫలితంగా గుట్టపాడు గ్రామంలో ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు భయంభయంగా జీవించాల్సి వస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ కోసం పేలుళ్లు చేస్తే.. పేదల ఇళ్లు కూలిపోతాయ్: గౌరు చరిత - Gaur Charita latest news
కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న జయరాజ్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ వద్ద తెదేపా నేత గౌరు చరిత ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పనుల కోసం చేస్తున్న పేలుళ్ల వల్ల సమీప గ్రామంలోని ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు.
గౌరు చరిత ఆందోళన