చేయని నేరాన్ని అంగీకరించాలంటూ వేధించడంతో నంద్యాలలో నిండు కుటుంబం బలైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. వైకాపా పాలనలో ముస్లింలపై వేధింపులు, అక్రమ కేసులు పెరిగాయని ఆరోపించారు. రాజమహేంద్రవరంలోనూ నిందితులకు అండగా నిలిచారని మండిపడ్డారు. కేసు వెనక్కి తీసుకోవాలని ముస్లిం బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా నేతల తీరుతో బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటున్న ప్రభుత్వం... దీనికి ఏమని సమాధానం చెప్తుంది? నంద్యాల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత