ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్‌ఐతో మాజీ మంత్రి అఖిలప్రియ వాగ్వాదం - tdp

తమ కార్యకర్త కుమారుడిని అకారణంగా పీఎస్​కు తీసుకురావటంపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు హత్య కేసులో యువకుడి తండ్రి ముద్దాయిగా ఉన్నాడు. అతను పోలీసుల సమక్షంలో హాజరు కాకపోవటంతో కుమారుడిని పోలీసుస్టేషన్​కు తరలించారు.

ఎస్‌ఐతో మాజీ మంత్రి అఖిలప్రియ వాగ్వాదం

By

Published : Oct 4, 2019, 5:29 PM IST

ఎస్‌ఐతో మాజీ మంత్రి అఖిలప్రియ వాగ్వాదం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటకు చెందిన యువకుడిని పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకురావటంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. యువకుడిని అక్రమంగా పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చి కొడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువకుడి తండ్రి నాలుగు హత్య కేసులో ముద్దాయి... అతను మూడు నెలలుగా పోలీసు స్టేషన్​కు రాకపోవటంతో.. ఆయన కుమారుడిని స్టేషన్​కు తీసుకువచ్చారు.దీనిపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయగా సీఐ ఎన్‌.వి.రమణ జోక్యం చేసుకొని సముదాయించారు.

ఇవీ చూడండి-మంత్రి పుష్పశ్రీవాణిపై కుల వివాదం..ఎస్టీ కాదని ఫిర్యాదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details