కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న గోనెహాల్లో తెదేపా నాయకుడిపై పోలీసులు అక్రమ కేసు పెట్టారంటూ బాధితుడి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. రెండేళ్ల క్రితం సొంత డబ్బులతో 90 వేలు ఖర్చు చేసి... అధికారుల అనుమతి తీసుకుని ఇంటికి కుళాయి వేసుకున్నట్లు అతని బంధువులు తెలిపారు. కుళాయి కనెక్షన్ తీసేటప్పుడు.... గ్రామ సెక్రటరీతో ఘర్షణ పడ్డాడని పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి బెంగళూర్లో తెదేపా నాయకుడిని అదుపులో తీసుకున్న పోలీసులు..... కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
అక్రమ కేసులు బనాయించారంటూ తెదేపా కార్యకర్తల ఆరోపణ - tdp leader arrest latest news in telugu
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న గోనెహాల్లో తెదేపా నాయకుడిపై పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు ఆందోళన చేపట్దారు.
![అక్రమ కేసులు బనాయించారంటూ తెదేపా కార్యకర్తల ఆరోపణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4880078-259-4880078-1572114072700.jpg)
tdp leader arrest in kurnool
అక్రమ కేసులు బనాయించారంటూ తెదేపా కార్యకర్తల ఆరోపణ
ఇదీ చూడండి: వైకాపా తప్పుడు కేసులు పెడుతోంది: వల్లభనేని వంశీ