ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుష్కర స్నానం చేసేందుకు ఘాట్​లలో నీరు లేదు' - తెదేపా ఇంఛార్జ్ తిక్కారెడ్డి వార్తలు

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా భక్తులు నదిలో స్నానం చేసేందుకు నీరు లేదని తెదేపా ఆగ్రహించింది. మంత్రాలయం ఘాట్​ల వద్ద ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయని పార్టీ నేత తిక్కారెడ్డి మండిపడ్డారు.

tikkareddy
తిక్కారెడ్డి, తెదేపా ఇంఛార్జ్

By

Published : Nov 21, 2020, 10:20 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పుష్కర ఘాట్​ల వద్ద నదిలో నీరు లేక భక్తులు స్నానం చేయలేని పరిస్థితి నెలకొందని.. తెదేపా సీనియర్ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. పుష్కరాల సందర్భంగా ఘాట్ వద్ద స్నానం చేశారు. పుష్కరాలు ప్రారంభమైనా.. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

ఘాట్ వద్ద నదిలో మురుగు నీరు కలుస్తున్నందున భక్తులు స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారన్న కారణంతో.. నదిలోకి సుంకేసుల నీటిని విడుదల చేశారని.. పైన ఘాట్​ల వద్ద నీరు లేక భక్తులు అవస్థలు పడుతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details