కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పంటలకు మద్దతు ధర, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని శ్రీనివాస టాకీస్ నుంచి సోమప్ప కూడలి వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సేవ చేయాలని భారీ మెజార్టీతో వైకాపాను గెలిపిస్తే.. వారు మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు.
'పంటలకు మద్దతు ధర కోరుతూ.. తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ' - కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా ఆధ్వర్యంలో ప్రభుత్వం పంటలకు మద్దతు ధర కల్పించాలని.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని ర్యాలీ నిర్వహిచారు. పంటకు పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో రైతులు ఉన్నా.. వైకాపా ప్రభుత్వాానికి అవి పట్టడం లేదని విమర్శించారు.
'పంటలకు మద్దతు ధర కోరుతూ.. తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ
రైతు రాజ్యం తెస్తామంటూ అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. కిలో టమోటా రూపాయికి అమ్ముడుపోవడంతో రైతులు పెట్టిన ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో పంటను రోడ్డుపై పోస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి:'ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేది చంద్రన్న కాదమ్మా... జగనన్న!'