ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమాలపై కలెక్టర్​కు తెదేపా ఫిర్యాదు - తెదేపా నేత అబ్దుల్ అజీజ్ వార్తలు

నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై తెదేపా నేత అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు తెదేపా వినతిపత్రం అందజేసింది.

Abdul Aziz
తెదేపానేత అబ్దుల్ అజీజ్

By

Published : Jun 18, 2021, 5:27 PM IST

నెల్లూరు జిల్లాలో ఇసుకను అక్రమంగా కొల్లగొడుతూ.. కోట్లు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు తెదేపానేతలు వినతిపత్రం అందజేశారు. గొల్లకందుకూరులోని ఇసుక రీచ్​లో.. పది రోజుల వ్యవధిలోనే 500 కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను తరలించారని తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆరోపించారు.

సరైన బిల్లులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెండరుదారులకు కేటాయించిన ఇసుకను పది రోజుల వ్యవధిలోనే తరలించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. అదే విధంగా గొల్ల కందుకూరు ఇసుక రీచ్​లో జరుగుతున్న అక్రమాలపై అబ్దుల్ అజీజ్.. గనులు, భూగర్భ శాఖ డీడీకి ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details