TDP Cheif Chandrababu fire on state police: ఆంధ్రప్రదేశ్‌లో కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ధ్వజమెత్తారు. రాను రాను రాష్ట్రంలో పోలీసులే ఫిర్యాదుదారులుగా మారి, టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని గుర్తు చేశారు. కుప్పం, పుంగనూరు ఘటనల్లో కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. మొదట్లో టీడీపీపై వైసీపీ వాళ్లు అక్రమ కేసులు పెడితే.. పోలీసులు అండగా నిలిచేవారని, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టే బాధ్యతను తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
'గంగ చంద్రముఖిగా మారినట్లు.. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారు' - పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారు
TDP Cheif Chandrababu fire on state police: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పోలీసులపై మరోసారి ట్విటర్ వేదికగా ఆగ్రహించారు. టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ.. పోలీసులే ఫిర్యాదుదారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాను రాను కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారుతున్నారని ఆక్షేపించారు.
పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారు
రజనీకాంత్ నటించిన సినిమాలో గంగ చంద్రముఖిగా మారినట్లు..రాష్ట్రంలో కొందరు పోలీసులు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా రూపాంతరం చెందిన క్రమం ఇది. మొదట్లో టీడీపీపై వైసీపీ అక్రమ కేసులకు అండగా నిలిచిన కొందరు పోలీసులు.. ఇక ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు.- చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి