పోలీసులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కర్నూలు జిల్లాలో తెదేపా అభ్యర్థి గోపాల్ ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరించొద్దని సీఐ సుబ్రమణ్యం కాళ్లు పట్టుకున్నారు. దొంగ ఓట్లు వేస్తున్న వారికి పోలీసులు సహకరిస్తున్నారని వాపోయారు. పక్క మండలాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని అభ్యర్థి తల్లి సీఐ కాళ్లు పట్టుకొని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు.
ఏకపక్షంగా వ్యవహరించొద్దు.. సీఐ కాళ్లు పట్టుకున్న తెదేపా అభ్యర్థి - election news in kurnool district
కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించొద్దని తెదేపా అభ్యర్థి గోపాల్ సీఐ కాళ్లు పట్టుకున్నారు. దొంగ ఓట్లు వేస్తున్న వారికి పోలీసులు సహకరిస్తున్నారని వాపోయారు.
సీఐ కాళ్లు పట్టుకున్న తెదేపా అభ్యర్థి
డోన్ మున్సిపాలిటీలో 32 వార్డులుండగా 25 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 7 వార్డులకు నిర్వహించిన పోలింగ్లో 57.79 శాతం పోలింగ్ నమోదైంది.
ఇదీ చదవండి
ఓటు వేసి... వృద్ధురాలు మృతి
Last Updated : Mar 10, 2021, 9:04 PM IST