కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెదేపా బాధ్యులు డి.విష్ణువర్ధన్‌రెడ్డిని కర్నూలులో పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఆయనపై ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసు విషయంలో... పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ నేతను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లటంపై విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు, అభిమానులు స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ నాయకుడిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కొంతసేపటి తర్వాత స్టేషన్ నుంచి విష్టువర్ధన్రెడ్డిని బయటికి తీసుకువెళ్తుండగా పోలీసు వాహనానికి వారందరు అడ్డుగా వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తామని చెప్పి పోలీసులు తెలిపారు.
తెదేపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్ట్‌పై... అనుచరుల ఆందోళన
గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు విషయంలో కోడుమూరు నియోజకవర్గ తెదేపా బాధ్యులు డి. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతని అరెస్టును నిరసిస్తూ అనుచరులు స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
తెదేపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్ట్‌పై అనుచరుల ఆందోళన