ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని పల్లెల్లో హోరు మొదలైంది. ఆదోని మండలం బలదుర్ గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు.

tdp and ycp fight at baladur
తెదేపా, వైకాపా వర్గీయుల మద్య ఘర్షణ

By

Published : Jan 23, 2021, 7:21 PM IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం బలదుర్ గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరిని ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆసుపత్రికి వెళ్లి గోడవపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

'ఇరు వర్గాల మధ్య గతం నుంచే ఓ స్థల విషయంలో వివాదం ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం వల్ల ఎన్నికల్లో తాను వ్యతిరేకంగా పోటీ చేస్తాననే అక్కసుతో వైకాపా వర్గీయులు తనపై దాడి చేశారు' అని తెదేపా నేత బజారప్ప ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details