'పాడైన రోడ్ల గురించి మాట్లాడినందుకు ఆటో డ్రైవర్ రవి మీద వైకాపా నాయకులు దాడి చేశారు' అంటూ తెదేపా, సీపీఎం నేతలు ఆదోనిలో ధర్నా చేపట్టారు. తిమ్మారెడ్డి బస్ స్టాండ్ వైపు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెళ్తున్న సమయంలో.. రహదారుల గురించి వేరే వ్యక్తితో రవి చర్చించాడన్నారు. చిన్న విషయానికే ఆరుగురు అధికార పార్టీ కార్యకర్తలు.. వారిద్దరినీ చితకబాదారని ఆరోపించారు. ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాడైన రోడ్ల గురించి మాట్లాడ్డం తప్పా అని ప్రశ్నించారు.
'రోడ్ల అధ్వాన స్థితిపై మాట్లాడ్డమే తప్పా?' - ఆదోనిలో ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన వారి అరెస్ట్‌కు తెదేపా, సీపీఎం డిమాండ్
'రోడ్ల అధ్వాన్న స్థితి గురించి మాట్లాడటమే ఆటో డ్రైవర్ చేసిన తప్పా' అంటూ తెదేపా, సీపీఎంలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. వైకాపా కార్యకర్తలు డ్రైవర్ పై దాడి చేశారని ఆరోపిస్తూ.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆదోనిలో నిరసనకు దిగాయి.
ఆటో డ్రైవర్ మీద దాడిపై ప్రతిపక్షాల ధర్నా