కర్నూలు సమీపంలోని నిడ్జూరు గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయులు మద్య వివాదం తలెత్తింది. ఇంటి ముందు కాలువ సమస్యతో ప్రారంభమైన గొడవ ఒకరి మృతికి దారి తీసింది. అయితే వైకాపా శ్రేణులే ఈ ఘటనకు కారణమని తెదేపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మృతుడు శ్రీనివాసులు కుటుంబం నుంచి తెదేపా తరుపున పోటీ చేశారు. ఈ కారణంగానే వైకాపా కార్యకర్తలు కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని నిర్జూరు వైకాపా నేత సత్యంరెడ్డి ఇంటి ముందు ఉంచి కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. పోలీసులు.. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
'ఎన్నికల్లో పోటీ చేశామన్న కక్షతోనే మా అన్నను చంపేశారు' - కర్నూలు జిల్లా వార్తలు
ఇంటి ముందు కాలువ సమస్యతో ప్రారంభమైన గొడవ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని నిడ్జూరు గ్రామంలో జరిగింది. మృతుడి తమ్ముడి భార్య గత ఎన్నికల్లో తెదేపా తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ కారణంగానే వైకాపా కార్యకర్తలు శ్రీనివాసులను కొట్టిచంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
!['ఎన్నికల్లో పోటీ చేశామన్న కక్షతోనే మా అన్నను చంపేశారు' tdp activist killed in ycp attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11694225-197-11694225-1620542448375.jpg)
tdp activist killed in ycp attack
'ఎన్నికల్లో పోటీ చేశామన్న కక్షతోనే మా అన్నను చంపేశారు'