కర్నూలులో హైకోర్టు త్వరగా ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్ కోరారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే.. వికేంద్రీకరణ సరిగా చేసిన వారవుతారని వ్యాఖ్యానించారు. చేయకపోతే... భాజపా అధినాయకులను సంప్రదించి... పోరాటాలు చేస్తామన్నారు. కర్నూలు ఆసుపత్రిని ప్రాంతీయ కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని టీజీ వెంకటేశ్ కోరారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పడుతుందని అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి: టీజీ వెంకటేశ్ - రాజధానిపై టీజీ వెకంటేశ్ కామెంట్స్
రాయలసీమలో రాజధాని ఉండాలని 90 ఏళ్లుగా సీమవాసులు కలలు కంటున్నారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలుకు హైకోర్టు ప్రకటించినా.. ఇంక కార్యరూపం దాల్చలేదన్నారు.
td venkatesh on capital