కేసుల తీవ్రత బట్టే లాక్డౌన్ సడలింపు: డీజీపీ - lockdown in ap
కరోనా కేసుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ గౌతం సవాంగ్ సమావేశం నిర్వహించారు.
![కేసుల తీవ్రత బట్టే లాక్డౌన్ సడలింపు: డీజీపీ dgp goutam Sawang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6942687-551-6942687-1587858534165.jpg)
కరోనాను పెద్ద సవాలుగా తీసుకుని పకడ్బందీగా విధులు నిర్వహించాలని.... డీజీపీ గౌతం సవాంగ్ అధికారులను ఆదేశించారు. కర్నూలులో పర్యటించిన ఆయన.. కరోనా కేసుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎవరూ బయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే విధులు నిర్వహించాలని సూచించారు. 55 ఏళ్లకు పైబడిన పోలీసులను వైరస్ ఉన్న ప్రాంతాల్లో విధులకు పంపరాదని సూచించారు. జిల్లాల వారిగా కేసుల తీవ్రతను బట్టి మే నెలలో లాక్‌డౌన్‌కు సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్న డీజీపీ పోలీసులు పడుతున్న కష్టాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అందుకే అన్ని చోట్ల నుంచి సిబ్బందికి అభినందనలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.