ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆలూరు కేంద్రంగా ‘వేదవతి’ డివిజన్‌కు కసరత్తు' - కర్నూలులో రూ.3,927 కోట్లతో నూతన ప్రాజెక్టులు

కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి కొత్తగా మంజూరైన వేదవతి, ఆర్డీఎస్‌ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డివిజన్ల ఏర్పాటు చిక్కుముడిగా మారింది. ఈ రెండింటిని ఎల్లెల్సీ డివిజన్‌ (ఆదోని) పరిధిలో ఉంచాలా? విడదీయాలా? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కోట్లాది రూపాయల విలువైన రెండు ప్రాజెక్టులకు ప్రత్యేక డివిజన్లు ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

The tangle of divisions
'ఆలూరు కేంద్రంగా ‘వేదవతి’ డివిజన్‌కు కసరత్తు'

By

Published : Nov 9, 2020, 4:01 PM IST

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి కొత్తగా మంజూరైన వేదవతి, ఆర్డీఎస్‌ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డివిజన్ల ఏర్పాటు చిక్కుముడిగా మారింది. ఈ రెండింటిని ఎల్లెల్సీ డివిజన్‌ (ఆదోని) పరిధిలో ఉంచాలా? విడదీయాలా? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కోట్లాది రూపాయల విలువైన రెండు ప్రాజెక్టులకు ప్రత్యేక డివిజన్లు ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రూ.3,927 కోట్లతో ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కొత్త డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆదోని కేంద్రంగా పనిచేస్తున్న ఎల్లెల్సీ డివిజన్‌ పరిధిలో ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టులు కొత్తగా వచ్చి చేరాయి. ఆర్డీఎస్‌ను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ఎమ్మిగనూరు కేంద్రంగా పనిచేయాలని, నంద్యాల ఎస్సార్బీసీలోని ఒకటో డివిజన్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ గత నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దీనిపై కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వేల ఎకరాల సేకరణ అవసరం
ఆలూరు కేంద్రంగా వేదవతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖలు సైతం పంపారు. ఆలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తైన గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు ‘వేదవతి’ డివిజన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.

వేదవతి ప్రాజెక్టు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉంది. దీని ద్వారా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మూడు రిజర్వాయర్ల ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. రూ.1,942 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో 3,380 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది.

ఎల్లెల్సీ పరిధిలో రూ.1,985 కోట్లతో ఏర్పాటుచేసే ఆర్డీఎస్‌ ప్రాజెక్టును ప్రత్యేక డివిజన్‌గా చేయడంతోపాటు నంద్యాలలోని ఎస్సార్బీసీ డివిజన్‌కు అప్పగించడం కొందరు నేతలకు ఆగ్రహం తెప్పించింది. తమకు తెలియకుండా ప్రభుత్వం సైతం ఉత్తర్వులు ఇవ్వడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎల్లెల్సీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న భాస్కరరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి కర్నూలు ఎం.ఐ. ఈఈకి అప్పగించారు.

ఎల్లెల్సీ పరిధిలోనే ప్రాజెక్టులు

ఎల్లెల్సీ పరిధిలోనే ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టులున్నాయి. గత నెలలో ప్రభుత్వ ఉత్తర్వు మేరకు ఆర్డీఎస్‌ డివిజన్‌గా ఏర్పడింది. తాజాగా ఆలూరు కేంద్రంగా వేదవతి ప్రాజెక్టుకు డివిజన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -ఎం.మురళీనాథరెడ్డి, ముఖ్య ఇంజినీరు, జలవనరులశాఖ, కర్నూలు

ఇదీ చదవండి:

వీర మరణం చెందిన జవాన్లకు చంద్రబాబు నివాళి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details