ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కర్నూలులో పేద విద్యార్థులకు ఆర్థిక సహయం చేశారు. కర్నూలు డీఎస్పీ కేవీ.మహేశ్ చేతుల మీదుగా ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయల చెక్కును తానా సభ్యులు అందించారు.
పేద విద్యార్థులకు తానా ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లాలోని పేద విద్యార్థులకు తానా సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. డీఎస్పీ మహేశ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు వందమందికి పైగా విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల ఆర్థిక సహాయం అందించామని తానా నిర్వహకులు తెలిపారు.
కర్నూలు పేద విద్యార్థులకు తానా ఆర్ఠిత సహాయం
కరోనా సమయంలో చాలా మందికి నిత్యావసర సరుకులతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన తానా సభ్యులను డీఎస్పీ అభినందించారు. తానా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు వందమందికి పైగా విద్యార్థులకు ఆర్థిక సహయం అందించామని తానా నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి :రేషన్ పంపిణీ వాహనాలను ప్రారంభించిన మంత్రి జయరాం