కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్ వద్ద విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పుష్కర స్నానమాచరించి నదీమతల్లికి పూజలు నిర్వహించారు.
కార్తీక సోమవారం కూడా కలిసి రావడంతో పుష్కర స్నానమాచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.