ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకున్న స్వాత్మానందేంద్ర స్వామి - swathmanandha at srisailam

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర శ్రీశైలంలోని వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పర్యటించారు.

Swatmanandendra Swamy visiting the Veerabhadra Swamy Temple in Srisailam
శ్రీశైలంలో వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకున్న స్వాత్మానందేంద్ర స్వామి

By

Published : Nov 25, 2020, 1:12 PM IST

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర శ్రీశైలం పర్యటనలో భాగంగా వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రస్వామి ప్రతిమకు హారతులిచ్చి పూజలు నిర్వహించారు. అధికారులు, పండితులు స్వామీజికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని స్వామి స్వాత్మానందేంద్ర సందర్శించారు. అక్కడి భ్రమరాంబికా అమ్మవారి ప్రతిమకు పూజలు చేశారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీ విగ్రహాన్ని సందర్శించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం యువత ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వామీజీ వెంట శ్రీశైలం ఈవో కేఎస్ రామారావు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details