ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనం స్వాధీనం.. తెదేపా నేత హత్యకు రెక్కీ నిర్వహించినట్లు అనుమానం - Suspicious vehicle seized in Govindapalli

కర్నూలు జిల్లా గోవిందపల్లె గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగిన ఓ స్కార్పియో వాహనాన్ని మిట్టపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో సిరివెళ్ల పోలీసులు గుర్తించి సీజ్​ చేశారు. గ్రామంలో ఓ తెదేపా నేత హత్యకు ఆ వాహనంలో రెక్కీ నిర్వహించినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Suspicious vehicle seized in Govindapalli
అనుమానాస్పద వాహనం స్వాధీనం

By

Published : Jul 13, 2021, 10:23 PM IST

కర్నూలు జిల్లా గోవిందపల్లె గ్రామానికి చెందిన ఓ తెదేపా నేతను హత్య చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇవాళ గోవిందపల్లి గ్రామంలో ఓ స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనించిన తెదేపా నేత.. సిరివెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా నల్లమల అటవీ ప్రాంతం వైపు వెళ్లింది. పోలీసులు వెంబటించడంతో మండల పరిధిలోని మిట్టపల్లె వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో వాహనాన్ని వదిలి దుండగులు పారిపోయారు. వాహనాన్ని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. వాహనంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో స్టిక్కర్ ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది.

అయితే ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. డీఎస్పీ రాజేంద్ర ఈ ఘటనపై స్పందించిందుకు నిరాకరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న మాట్లాడుతామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details