ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి - గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి న్యూస్

కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి
గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి

By

Published : Jan 9, 2021, 11:04 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇంటర్​ మెుదటి సంవత్సరం చదువుతున్న పుష్పలత అనే విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మెట్ల వద్ద విద్యార్థిని విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన తోటి స్నేహితులు ప్రిన్సిపాల్​కు సమాచారం అందించారు. వైద్యుడిని రప్పించి పరీక్షించినా.. ఫలితం లేకపోవటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కాగా...ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా..మృతురాలిది బేతంచెర్ల పట్టణం దర్గాపేటగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details