Degree Student Suspicious Death: కర్నూలు జిల్లాలోని సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి రాజ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం కళాశాలకు వచ్చేందుకు తయారవుతున్న క్రమంలో ఛాతీలో నొప్పి వచ్చినట్లు తోటి విద్యార్థులకు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం రాజ్ కుమార్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. రాజ్ కుమార్.. కర్నూలు నగరంలోని ఓ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. సమాచారం తెలుసుకున్న మూడవ పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలులో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి - కళాశాలకు వచ్చేందుకు రెడీ అవుతుండగా ఛాతీ నొప్పి
suspicious death of degree student in kurnool: కర్నూలు జిల్లాలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రాజ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి