కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయంలో పనిచేసే 11మంది సిబ్బంది... సహోద్యోగి పుట్టిన రోజు సందర్భంగా ఆడి పాడారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
కరోనాతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలా వ్యవహరించడం తప్పంటూ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.