కర్నూలులోని పంచలింగాల గ్రామం వద్ద ఉత్తరఫుడ్స్ కంపెనీలో పోతిమహేశ్ నాయక్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. అతనికి జూనియర్‌గా రమేశ్‌ను నియమించారు. పని విషయంలో నిత్యం వేధిస్తున్నాడని.. మహేశ్‌ను రమేశ్ చంపేశాడు.
పనిలో వేధిస్తున్నాడని సీనియర్‌ను చంపేసిన జూనియర్ సూపర్వైజర్ - supervisor murder news
పనిలో వేధిస్తున్నాడని సూపర్వైజర్ను అతని జూనియర్ హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా పంచలింగాలలో జరిగింది. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రమేశ్.. తన తమ్ముడు, సమీప బంధువులు ఇద్దరితో కలిసి ఈ నెల 2న మహేశ్ ఇంటికి వెళ్లారు. అతనిపై దాడి చేసి.. తలపై కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. పంచలింగాల వీఆర్వో దగ్గరకు వెళ్లి నిందితులు నేరం అంగీకరించారని వివరించారు. పోలీసులకు వీఆర్వో సమాచారం ఇవ్వటంతో.. వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఆ నలుగురిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. యువకుడు మృతి