కర్నూలు జిల్లా నంద్యాలలో ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డా. విజయకుమార్ అన్నారు. ఆక్సిజన్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో కొన్ని సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని… త్వరలోనే ఆక్సిజన్ ట్యాంకర్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు డీఎస్పీ చిదానందరెడ్డితో కలిసి ఆస్పత్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైద్యశాలలో కొవిడ్‌కు సంబంధించి 60 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. తద్వారా అంతకు మించి రోగులకు చికిత్స చేయడానికి వీలు కాదన్నారు. ఈ విషయంలో ప్రజలు క్షమించాలని ఆయన కోరారు.