కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతికి కొన్నిరోజుల ముందు వరకు ఆసుపత్రుల్లో పడకలే దొరకని పరిస్థితి. ఇది గమనించిన సీపీఎం అనుబంధ సంస్థ సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసింది. కర్నూలులోని సీపీఎం కార్యాలాయన్ని ఖాళీ చేసి, 20 పడకల కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 10న ప్రారంభమైన ఈ కేంద్రంలో ఇప్పటిదాకా 50 మంది వైరస్ బాధితులు చికిత్స పొందారు. కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉండటానికి అవకాశం లేనివారిని ఇక్కడ చేర్చుకుంటున్నారు.
కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్న 'సుందరయ్య స్ఫూర్తి కేంద్రం' - corna latest news
కొవిడ్ కబళిస్తున్న వేళ వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు తమవంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. బాధితులకు భరోసానిస్తున్నాయి. కర్నూలులో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో కొవిడ్ కేంద్రం నిర్వహిస్తూ రోగుల బాగోగులను చూసుకుంటున్నారు.
![కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్న 'సుందరయ్య స్ఫూర్తి కేంద్రం' Sundarayya Inspiration Center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12036733-941-12036733-1622976751834.jpg)
కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్న సుందరయ్య స్ఫూర్తి కేంద్రం సేవలు
కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్న సుందరయ్య స్ఫూర్తి కేంద్రం సేవలు
ఈ కేంద్రంలో మూడు పూటలా పౌష్టికాహారంతో పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వాలంటీర్లు ఇక్కడ సేవలందిస్తున్నారు. కరోనా పూర్తిగా తగ్గేవరకూ ఈ కేంద్రం కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీచదవండి.: Case filed on Somireddy: కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు!