కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ దుర్గ భోగేశ్వరస్వామి దేవస్థానంలో.. సూర్య కిరణాలు స్వామివారిని తాకాయి. కార్తికమాసంలో పౌర్ణమి తరువాత పది రోజులపాటు శివలింగంపై సూర్య కిరణాలు ప్రసరించటం ఇక్కడ ప్రత్యేకత. ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సూర్య కిరణాలు స్వామివారిపై ప్రసరిస్తున్న సమయంలో స్వామివారిని దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వాసం.
దుర్గాభోగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని తాకిన సూర్యకిరణాలు - పౌర్ణమి అనంతరం శివునిపై పడ్డ సూర్యకిరణాలు తాజా వార్తలు
గర్భగుడిలోని శివలింగంపై సూర్యకిరణాలు పడిన దృశ్యం కర్నూలు జిల్లాలోని శ్రీ దుర్గ భోగేశ్వరస్వామి దేవస్థానంలో చోటు చేసుకుంది. పది రోజులుపాటు ఆవిష్కృతమయ్యే ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

దుర్గాభోగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని చేరిన సూర్యకిరణాలు