ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Father and Son Suicide: 'అధికారుల నిర్వాకం.. తండ్రీకుమారుల బలవన్మరణం'

కర్నూలు జిల్లా నంద్యాలలో తండ్రీ కుమారులు బలవన్మరణానికి పాల్పడ్డారు. భూమి విషయంలో అధికారులు చేసిన అక్రమాలే.. ఈ దుర్ఘటనకు కారణమని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

పోలీసులతో వాగ్వాదానికి మృతుల బంధువులు
పోలీసులతో వాగ్వాదానికి మృతుల బంధువులు

By

Published : Aug 8, 2021, 5:21 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల కోటవీధికి చెందిన తండ్రీ కుమారులు సుబ్బారాయుడు, నాగరమేష్ కు చెందిన భూమిని.. మరో వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు ఆన్​లైన్​లో బదలాయించారు. ఇకపై.. తమ భూమి తమకు దక్కదని ఆవేదనకు గురైన నాగ రమేష్.. 3 రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతి జీర్ణించుకోలేక మనస్థాపం చెందిన తండ్రి సుబ్బారాయుడు.. పురుగుల మందు తాగి తాను సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రెవెన్యూ అధికారులు అక్రమంగా భూములను మరొకరి పేర ఆన్​లైన్ చేయడమే తండ్రీకుమారుల బలవన్మరణానికి కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. నంద్యాల తాలూకా పోలీసు స్టేషన్ ఎదుట రహదారిపై సుబ్బారాయుడు మృతదేహం తో ధర్నా చేశారు. రెవెన్యూ అధికారుల తీరుపై వారంతా మండిపడ్డారు. పొలాన్ని రాయించుకున్న కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details