అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య - అప్పుల బాధ భరించలేక కర్నూలు జిల్లాలో యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో జరిగింది.
![అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య Suicide is unbearable](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5547558-991-5547558-1577775081625.jpg)
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో అప్పుల బాధ భరించలేక విజయ్ కుమార్ అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్దిలేటి, శివమ్మలకు కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె నాగలక్ష్మి సంతానం. విజయ్ కుమార్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాల కిందట వారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండేది. అప్పులు పెరగడంతో ఐదు ఎకరాలు అమ్ముకున్నారు. గత రెండేళ్లుగా తమకున్న మూడు ఎకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకొని పత్తి జొన్న పంటలను సాగు చేశారు. పకృతి ప్రతాపంతో పంట దిగుబడి రాక అప్పులు పెరిగిపోయాయి.
TAGGED:
Suicide is unbearable